స్టీల్ ప్లాంట్ కు సంబంధించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయండి: జగన్ కు గంటా లేఖ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ ప్రధాని మోదీకి జగన్ లేఖ రాసిన నేపథ్యంలో... సీఎంకు తన లేఖలో గంటా ధన్యవాదాలు తెలిపారు.

ప్లాంట్ ను మరింత బలోపేతం చేసేందుకు సూచనలు చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై వెంటనే కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎంని కోరారు. వైజాగ్ ప్లాంట్ కు సంబంధించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని సూచించారు.

వైజాగ్ ప్లాంటులో పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీలు కలసికట్టుగా పని చేయాలని అన్నారు. ఈ అంశంలో అన్ని పార్టీల నేతల అభిప్రాయాలను తీసుకోవడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

Ganta Srinivasa Rao
Telugudesam
Jagan
YSRCP
Vizag Steel Plant
Narendra Modi
BJP

More Telugu News